ఆరోగ్యంగా, ఆనందంగా, హుషారుగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం.నిద్రతోనే ఏదో జబ్బులను కూడా దూరం చేసుకోవచ్చు.
ప్రతి రోజు తగినంత నిద్రలేకుంటే మానసిక, శారీరక సమస్యలు చుట్టుముట్టేస్తుంటాయి.అందుకే రోజుకు దాదాపు ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటుంది.
ఇక ఉద్యోగుల విషయం పక్కన పెడితే.ఇంట్లో ఉండేవాళ్లలో చాలా మంది పగటి పూట నిద్రపోతుంటారు.
ముఖ్యంగా భోజనం తర్వాత ఓ కునుకు నిద్ర తీస్తే.ఆ మజానే వేరు.

అయితే చాలా మంది పగటి పూట నిద్ర పోతే ఆరోగ్యానికి మంచిది కాదని అనుకుంటారు.కానీ, పగటి నిద్ర ఒకింత మంచిదే.పగటి పూట నిద్ర పోవడం వల్ల మెదడులో ఒత్తిడిని తగ్గించే నార్‌ఎపీనెఫ్రిన్ అనే హార్మోను ఎక్కువగా తయారవుతుందట.అది గుండెజబ్బులనూ, రక్తపోటునూ, మధుమేహాన్ని తగ్గించి.ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందట.అలాగే పనులు చేసి చేసి బాగా అలసిపోయిన వారు పగటి పూట ఓ కునుకు.
మళ్లీ ఎనర్జిటిక్‌గా మారతారట.మరియు మెదడు కూడా రీఫ్రెష్ అయ్యి ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుందట.

అయితే పగటి నిద్ర మంచిదే.కానీ, ఎంత వరకు అంటే కేవలం పది నుంచి ఇరవై నిమిషాలు పడుకున్నంత వరకే.అంతకు మించి గంటలు గంటలు పగటి పూట నిద్రిస్తే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.పగలు గంటలు తరబడి నిద్రస్తే.భవిష్యత్తులో డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే అరగంట మించి నిద్రించడం వల్ల ఆలోచించే శక్తి మరియు పని చేసే సామర్థ్యం తగ్గిపోతాయట.ఇక పగటి పూట గంటలు గంటలు నిద్రించడం వల్ల గుండె జబ్బులు, స్థూలకాయం, అధిక రక్తపోటు ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.ఇక పగలు ఎక్కువ సమయం పడుకుంటే.
రాత్రి నిద్ర దెబ్బ తింటుంది.దాంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు చుట్టుముట్టేస్తాయి.
కాబట్టి, పగటి పూట నిద్రను కేవలం పది లేదా ఇరవై నిమిషాలకే పరిమితం చేయండి.