చంద్రబాబు చేనేత కార్మికులను మోసం చేశారు..: సీఎం జగన్

ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ ( cm jagan )నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది.ఇందులో భాగంగా చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహించారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) చేనేత కార్మికులను మోసం చేశారని సీఎం జగన్ తెలిపారు.2014 మ్యానిఫెస్టోలో చంద్రబాబు ఎన్నో హామీలను ఇచ్చారన్న ఆయన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం ఎగ్గొట్టారని చెప్పారు.నేతన్నల కోసం రూ.3,706 కోట్లు ఖర్చు చేశామన్నారు.నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.గత ప్రభుత్వం ఆప్కోకు పెట్టిన బకాయిలను కూడా తీర్చామని సీఎం జగన్ తెలిపారు.స్కూల్ పిల్లలకు మూడు జతల యూనిఫామ్ లు ఇస్తున్నామన్న ఆయన చేనేత కార్మికుల నుంచే వస్త్రాలు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.

 Chandrababu Cheated Handloom Workers Cm Jagan, Cm Jagan, Chandrababu, Memantha S-TeluguStop.com

ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా అర్హత ఉన్న అందరినీ ఆదుకున్నామని సీఎం జగన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube