ఇందిర హత్యను గుర్తుచేసేలా ఖలిస్తాన్ వాదుల నిరసన .. స్పందించిన కెనడా మంత్రి , ఏమన్నారంటే..?

ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవం సందర్భంగా కెనడాలోని( Canada ) వాంకోవర్‌లో( Vancouver ) జూన్ 6వ తేదీన ఖలిస్తాన్ మద్ధతుదారులు( Khalistan Supporters ) చేసిన నిరసన ప్రదర్శన దుమారం రేపుతోంది.దివంగత భారత ప్రధాని ఇందిరా గాంధీ( Indira Gandhi ) హత్యోదంతాన్ని గుర్తుచేసేలా ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదాస్పదమయ్యాయి.

 Canada Minister Of Public Safety Dominic A Leblanc Reacts On Khalistani Supporte-TeluguStop.com

దీనిపై ఇప్పటికే భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కెనడా పబ్లిక్ సేఫ్టీ మంత్రి డొమినిక్ ఎ లెబ్లాండ్( Dominic A LeBlanc ) స్పందించారు.

కెనడాలో హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదన్నారు.

మరోవైపు భారత సంతతికి చెందిన కెనడా చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్య( Chandra Arya ) కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఖలిస్తాన్ మద్ధతుదారులు హిందూ – కెనడియన్లలో హింసాత్మక భయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.నేపియన్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్ర.ఇప్పటికే ఎస్ఎఫ్‌జే నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హిందువులను తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాడని గుర్తుచేశారు.కెనడాలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తక్షణం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆర్య పిలుపునిచ్చారు.

Telugu Brampton, Canadapublic, Chandra Arya, Dominic Leblanc, Hindu Canadians, I

అయితే కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ నిరసన తెలపడం ఇదే తొలిసారి కాదు.గతేడాది జూన్‌లోనూ ఇదే రకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు.బ్రాంప్టన్ నగరంలో( Brampton ) దాదాపు 5 కిలోమీటర్ల మేర నిర్వహించిన ప్రదర్శనలో ఇందిర హత్యోదంతాన్ని తెలుపుతూ శకటాన్ని ప్రదర్శించారు.తలపాగాలు ధరించిన ఇద్దరు గన్‌మెన్‌లు ఇందిరపై కాల్పులు జరుపుతుండగా.

రక్తపు మరకలు, బుల్లెట్ గాయాలతో ఇందిర కుప్పకూలుతున్నట్లుగా దీనిని ప్రదర్శించారు.

Telugu Brampton, Canadapublic, Chandra Arya, Dominic Leblanc, Hindu Canadians, I

ఈ ఘటనపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( S Jaishankar ) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కెనడా ఇలా చేస్తోందన్నారు.వేర్పాటువాదులు, తీవ్రవాదులకు అక్కడ అవకాశాలు లభిస్తున్నాయని.

ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలకు , ప్రత్యేకించి కెనడాకు మంచిది కాదని జైశంకర్ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా సైతం ఈ చర్యను ఖండించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube