ఇందిర హత్యను గుర్తుచేసేలా ఖలిస్తాన్ వాదుల నిరసన .. స్పందించిన కెనడా మంత్రి , ఏమన్నారంటే..?

ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవం సందర్భంగా కెనడాలోని( Canada ) వాంకోవర్‌లో( Vancouver ) జూన్ 6వ తేదీన ఖలిస్తాన్ మద్ధతుదారులు( Khalistan Supporters ) చేసిన నిరసన ప్రదర్శన దుమారం రేపుతోంది.

దివంగత భారత ప్రధాని ఇందిరా గాంధీ( Indira Gandhi ) హత్యోదంతాన్ని గుర్తుచేసేలా ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదాస్పదమయ్యాయి.

దీనిపై ఇప్పటికే భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కెనడా పబ్లిక్ సేఫ్టీ మంత్రి డొమినిక్ ఎ లెబ్లాండ్( Dominic A LeBlanc ) స్పందించారు.

కెనడాలో హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదన్నారు.మరోవైపు భారత సంతతికి చెందిన కెనడా చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్య( Chandra Arya ) కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఖలిస్తాన్ మద్ధతుదారులు హిందూ - కెనడియన్లలో హింసాత్మక భయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

నేపియన్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్ర.ఇప్పటికే ఎస్ఎఫ్‌జే నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హిందువులను తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాడని గుర్తుచేశారు.

కెనడాలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తక్షణం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆర్య పిలుపునిచ్చారు.

"""/" / అయితే కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ నిరసన తెలపడం ఇదే తొలిసారి కాదు.

గతేడాది జూన్‌లోనూ ఇదే రకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు.బ్రాంప్టన్ నగరంలో( Brampton ) దాదాపు 5 కిలోమీటర్ల మేర నిర్వహించిన ప్రదర్శనలో ఇందిర హత్యోదంతాన్ని తెలుపుతూ శకటాన్ని ప్రదర్శించారు.

తలపాగాలు ధరించిన ఇద్దరు గన్‌మెన్‌లు ఇందిరపై కాల్పులు జరుపుతుండగా.రక్తపు మరకలు, బుల్లెట్ గాయాలతో ఇందిర కుప్పకూలుతున్నట్లుగా దీనిని ప్రదర్శించారు.

"""/" / ఈ ఘటనపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( S Jaishankar ) ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కెనడా ఇలా చేస్తోందన్నారు.వేర్పాటువాదులు, తీవ్రవాదులకు అక్కడ అవకాశాలు లభిస్తున్నాయని.

ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలకు , ప్రత్యేకించి కెనడాకు మంచిది కాదని జైశంకర్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా సైతం ఈ చర్యను ఖండించారు.

ఈ స్టార్ హీరోల భార్యల గురించి మీకు తెలుసా.. ఆ వ్యాపారాల్లో అదుర్స్ అనిపించారుగా!