స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో తను చేస్తున్న పనుల ద్వారా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నారు.ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న బన్నీ తన డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
కొన్నిరోజుల క్రితం కేరళలో విద్యార్థికి సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన బన్నీ కష్టాల్లో ఉన్న డ్రైవర్ కు భారీగా సహాయం అందించి వార్తల్లో నిలిచారు.
దాదాపుగా పది సంవత్సరాల నుంచి మణిపాల్ అనే వ్యక్తి బన్నీ దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్నారు.
మహిపాల్ బన్నీకి ఎంతో నమ్మకమైన డ్రైవర్ కాగా అతనికి బన్నీ భారీగానే జీతం ఇస్తున్నారు.మహిపాల్ బోరబండలో నివాసం ఉంటున్నారు.అయిత్గే మహిపాల్ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావించి తన దగ్గర ఉన్న డబ్బుతో ఇల్లు కట్టుకుంటుండగా ఈ విషయం తెలిసిన బన్నీ అతనికి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
డ్రైవర్ కోసం బన్నీ ఊహించని స్థాయిలో సహాయం చేయడం గమనార్హం.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రియల్ లైఫ్ లో కూడా గొప్ప హీరో అనిపించుకునే దిశగా బన్నీ అడుగులు వేస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.బన్నీ వరుసగా మంచి పనులు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.