యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.శ్వేత తెలుగు ఫుడ్స్ కు చెందిన బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
పలువురు మహిళా కూలీలకు గాయాలు కావడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.
బాధితులు దేవాలమ్మ నాగారం గ్రామస్తులుగా గుర్తించారు.స్థానికుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.