ఐదేళ్లకోసారి ఆ ఊర్లో వెరైటీ బోనాలు.. అసలు విషయం ఏమిటంటే..?!

సాధారణంగా ఏ గ్రామంలో అయినా కానీ 5 సంవత్సరాలకు ఒకసారి కానీ 10 సంవత్సరాలకు ఒకసారి జాతరలు, గ్రామ దేవతలకు ప్రత్యేక  పూజలు చేయడం చూస్తూనే ఉంటాం.ఇలా నిర్వహించే జాతర  గ్రామ ప్రజలు అందరిని కూడా చల్లగా చూడాలని.

 Bonal, Jathara, Viral News, Viral Latest, Variety Bonalu, Suglampally,latest New-TeluguStop.com

వారి పాడిపంటలు, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని 5 సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఎత్తున పోచమ్మకు పూజలు నిర్వహిస్తారు ఒక గ్రామం వారు.అంతేకాకుండా పూజలు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ఊరు ఊరంతా కూడా ముఖం కడగరు.

చీపురు పట్టి వాకిలి ఊడ్చేది లేదు.కళ్లాపి చల్లేది లేదు.

వాస్తవానికి అది ఆ ఊరిలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయంగా ఇప్పటి వరకు వారు అలానే కొనసాగిస్తున్నారు.ఇది వినడానికి చాలా వింతగా అనిపించినా ఇది నిజంగా జరుగుతుంది.

ఇంతకీ అది ఎక్కడ ఉంది.?! తదితర వివరాలు తెలుసుకుందాం.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామదేవత పోచమ్మ , భూలక్ష్మి జాతర్లు అంగరంగ వైభవంగా గ్రామస్తులందరూ నిర్వహిస్తారు.వారి గ్రామంలో కరోనా సోకకుండా పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహించడంతో పాటు ఊరంతా కూడా డప్పు చప్పుళ్లు, బోనాలతో పోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు గ్రామస్తులందరూ.

ఈ జాతరలో భాగంగా ఊరంతా ఒక రోజు ముందే బంధనం వేస్తారు.అది ఏమిటంటే.ఆ గ్రామంలోకి ఎవరు కూడా రాకూడదు, అంతేకాకుండా ఆ గ్రామంలో నుంచి ఎవరు కూడా పక్క గ్రామానికి వెళ్ళకూడదు అనే  నిబంధనలు పాటిస్తారు.ఈ క్రమంలో పోచమ్మ ఆలయానికి ఇంటికొక భోజనాన్ని నైవేద్యంగా సమర్పించి, అనంతరం తెల్లవారుజామున భూలక్ష్మి విగ్రహాల వద్ద పట్నం వేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గ్రామస్తులు.

ఇక మరో విచిత్రమేమిటంటే.ఈ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి అయ్యేంతవరకు ఎవరూ కూడా  సుగ్లాంపల్లి  గ్రామంలో నుంచి ఎవరు కూడా పొరుగూరికి వెళ్లరు.

అలాగే ఎవ్వరూ వాకిలి ఊడవరు, కళ్ళాపి చల్లరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube