బాలీవుడ్ హీరోయిన్ ముద్దుగుమ్మ రేఖ( Rekha ) గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు రేఖ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
సౌత్ నార్త్ లో కలిసి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది.అయితే వెండితెరపై రీల్ లైఫ్ లో సక్సెస్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో అన్ని ఫెయిల్యూర్స్.
ఆమె జీవితంలో ప్రేమకథలెన్నో ఉన్నాయి.కాని అన్ని ఫెయిల్యూర్ స్టోరీసే ఆమె మొదటి ప్రేమ అమితాబ్ తో పెళ్లైందని తెలిసి కూడా అమితాబ్ బచ్చన్ ను ప్రేమించింది రేఖ.కానీ జయాబచ్చన్ కఠినంగా వ్యవహరించడంతో వీరి ప్రేమకు ఫుల్స్ స్టాప్ పడింది.ఆ తరువాత స్టార్ క్రికెటర్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్( Imran Khan ) తో కూడా ఆమె ప్రేమలో పడిందంటూ అప్పట్లో వార్త బాగా వైరల్ అయ్యింది.
వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్లి చేసుకుంటారు అనుకునేలోపే విడిపోయారు అంటూ వార్తలు వినిపించాయి.ఆ తరువాత రేఖ వినోడ్ మెహ్రాను సీక్రేట్ గా పెళ్లాడిందట.అప్పట్లో ఆమె నుదుట సిందూరం పెట్టుకోవడంతో అందరికి అనుమానం వచ్చి ఆరా తీస్తే తెలిసిన విషయం ఇది.అయితే వీరిద్దరికి కొద్ది కాలానికే మనస్పర్ధలు వచ్చి విడిపోయారట.ఇక ఆతరువాత ఆమె కొన్ని పార్టీలలో పరిచయం అయిన వ్యాపార వేత్త అయిన ముఖేష్ అగర్వాల్ ను పెళ్ళాడింది.ఒక పార్టీలో ముఖేష్ స్వయంగా మనం పెళ్ళి చేసుకుందాం అని రేఖని అడిగాడట.
దాంతో ఆమె వెంటనే ఒకే చెప్పేసిందట.కానీ వీరి పెళ్ళి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.రేఖను పెళ్ళాడిని కొంతకాలానికే ముఖేష్ రేఖ చున్నీతో ఉరి వేసుకుని చనిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది.అప్పట్లో ఈ విషయంలో రేఖపై విమర్శలు కూడా వచ్చాయి.ఆమెసి నిమా పోస్టర్లపై పేడ కొట్టారు ఆడియన్స్.అయితే రేఖ జీవితంలో ఆమె సెక్రట్రీ ఫర్జానాదే అధికారం అని ఎన్నో గాసిప్స్ వచ్చాయి.
ఆమె ఏది చెపితే అది రేఖ చేస్తుందని.ఆమె చేతిలో బొమ్మగా మారిందంటూ రకరకాల వివాదాలు వచ్చాయి.
రేఖ దాదాపు 30 ఏళ్ళు తన సహా యకురాలు ఏది చెపితే అది చేసినట్టు రేఖ జీవిత చరిత్రలో కూడా ఇన్ డైరెక్ట్ గా రాయబడింది.ఒక దశలో రేఖ తన సహాయకురాలితో సహజీవనం చేస్తుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి.కానీ రేఖ మాత్రం ఫర్జానాను తన సోదరిలా భావిస్తానని తెలిపింది.కొన్నిదశాబ్ధాలు బాలీవుడ్ తెరను ఏలిన రేఖ, తన సొంత జీవితాన్ని మాత్రం సక్రమంగా మలుచుకోలేక పోయారు.
ఆమె జీవితంలో ప్రతీ లవ్ స్టోరీ ఫేయిల్యూర్ స్టోరీగానే మిగిలిపోయింది.