విశాఖలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చ్ జరిగింది.అనంతరం ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కాంగ్రెస్ సృష్టించిన ప్రజా సంపద అని తెలిపారు.
విశాఖ ఉక్కు ప్రజల సొత్తు అని స్పష్టం చేశారు.స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విశాఖకు వస్తారని, స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి ఆయన సంఘీభావం తెలుపుతారని వెల్లడించారు.







