రాజన్న సిరిసిల్ల జిల్లా:మణిపూర్ లో గిరిజన మహిళలను వివస్త్రాలను చేసి నడి రోడ్డుపై ఊరేగించిన నిందితులను ఉరితీయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీర రాజు నాయక్ పత్రిక ప్రకటనలో శుక్రవారం పేర్కొన్నారు.సభ్య సమాజం తలదించుకునేలా మణిపూర్ లో సంఘటన చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసి గిరిజనులపై ఇంత దారుణం జరుగుతుంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసమే ఏర్పడిన శాఖను పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆదివాసి గిరిజనులపై ఇలా జరగడం సిగ్గుచేటన్నారు.
మై తేలి, కుకీ తేగల మధ్య జరిగిన ఘర్షణకు కారణం ఆ రాష్ట్ర బిజెపి సర్కారుదే అని చాలామంది గిరిజనులు మణిపురం వదిలి వెళ్ళిపోతున్నారని, హింసను నివారించి సాధారణ పరిస్థితిలో నెలకొనేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు.