అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన బాలీవుడ్ లెజెండ‌రీ యాక్టర్.. !

ఈ రోజు ఉద‌యం ముంబైలోని హిందూజా ఆసుప‌త్రిలో బాలీవుడ్ లెజెండ‌రీ యాక్టర్ దిలీప్ కుమార్ (98) జాయిన్ అయ్యినట్లుగా సమాచారం.కాగా దిలీప్ కుమార్ ఏ అనారోగ్య స‌మ‌స్య‌ కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరార‌న్న విష‌యంపై ఇప్పటికి స్ప‌ష్టత రాలేదు.

 Bollywood Legendary Actor Admitted To Hospita Due To Illness Bollywood, Legendar-TeluguStop.com

కానీ ఈయనకు కార్డియాల‌జిస్ట్ నితిన్ గోఖ‌లె, ప‌ల్మనాల‌జిస్ట్ జ‌లీల్ ప‌ర్కార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందుతుందని మాత్రం వార్త బయటకు వచ్చింది.

ఇకపోతే గ‌త నెల‌లో కూడా దిలీప్ కుమార్ ఆరోగ్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రిలో చేరి, రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.

కాగా ఈయన ఆరోగ్య విషయంలో సాయంత్రం వరకు వైద్యులు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉందని తెలుస్తుంది.ఇదిలా ఉండగా గ‌త సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ లో కోవిడ్ సోకి దిలీప్ కుమార్ సోద‌రులు ఈషాన్ (90), అస్లాం ఖాన్ (88)కి ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఇక ఈయన వయస్సు రిత్య కూడా పెద్దవారు కావడం వల్ల ఎప్పుడు ఏ వార్త వినవలసి వస్తుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube