అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన బాలీవుడ్ లెజెండ‌రీ యాక్టర్.. !

ఈ రోజు ఉద‌యం ముంబైలోని హిందూజా ఆసుప‌త్రిలో బాలీవుడ్ లెజెండ‌రీ యాక్టర్ దిలీప్ కుమార్ (98) జాయిన్ అయ్యినట్లుగా సమాచారం.

కాగా దిలీప్ కుమార్ ఏ అనారోగ్య స‌మ‌స్య‌ కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరార‌న్న విష‌యంపై ఇప్పటికి స్ప‌ష్టత రాలేదు.

కానీ ఈయనకు కార్డియాల‌జిస్ట్ నితిన్ గోఖ‌లె, ప‌ల్మనాల‌జిస్ట్ జ‌లీల్ ప‌ర్కార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందుతుందని మాత్రం వార్త బయటకు వచ్చింది.

ఇకపోతే గ‌త నెల‌లో కూడా దిలీప్ కుమార్ ఆరోగ్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రిలో చేరి, రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.

కాగా ఈయన ఆరోగ్య విషయంలో సాయంత్రం వరకు వైద్యులు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా గ‌త సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ లో కోవిడ్ సోకి దిలీప్ కుమార్ సోద‌రులు ఈషాన్ (90), అస్లాం ఖాన్ (88)కి ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఇక ఈయన వయస్సు రిత్య కూడా పెద్దవారు కావడం వల్ల ఎప్పుడు ఏ వార్త వినవలసి వస్తుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారట.

ఎన్నారై స్టూడెంట్ సంచలనం.. భారతీయులకంటే హోంలెస్ వాళ్లకే ఎక్కువ మర్యాద ఉంటుందట!