బాలీవుడ్లో బెస్ట్ సినిమాలకు, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్ ఇలా పలు విభాగాల్లో అవార్డులు ఇస్తారు అనే విషయం తెల్సిందే.ఇక అక్కడ చెత్త అవార్డులు కూడా ఇస్తారు.
ఆ సంవత్సరంలో ఏ సినిమా అయితే చెత్తగా ఉంటుంది, ఏ హీరో చెత్తగా చేశాడు, ఏ హీరోయిన్ చెత్తగా చేసిందో చెబుతూ కేలా అవార్డులను ఇస్తారు.ఈ విభాగంగాలో వరుసగా మూడు సార్లు చెత్త అవార్డును గెలుచుకుంది పొడుగు కాళ్ల సుందరి సోనాక్షి సిన్హా.
ఈ అమ్మడు 2013, 2014, 2015లో వరుసగా ‘గోల్డెన్ కేలా’ అవార్డును సొంతం చేసుకుని రికార్డును సృష్టించింది.ఈ సంవత్సరంకు గాను ఈమె ‘లింగ’, ‘యాక్షన్ జాక్సన్’లో చెత్త ప్రదర్శణ చేసినందుకు చెత్త అవార్డును ఇచ్చారు.
హీరో అర్జున్ కపూర్ ‘ఉత్తమ చెత్త నటుడు’, ప్రభుదేవాకు చెత్త దర్శకుడు, యాక్షన్ జాక్సన్ సినిమాకు చెత్త సినిమా అవార్డు దక్కింది.ఈ అవార్డును ఏడు సంవత్సరాలుగా ఇస్తున్నారు.
హాలీవుడ్లో ‘గోల్డెన్ రీస్బెర్రి’ అవార్డును ఇస్తారు.చెత్త ప్రదర్శణ చేసే వారికి ఇచ్చే అవార్డు తరహాలోనే బాలీవుడ్లో కూడా ఈ కేలా అవార్డులు ఇస్తున్నారు.
ఇలాంటి అవార్డులు తెలుగులో కూడా ఉంటే బాగుండు కదా… తెలుగులో చెత్త సినిమా, చెత్త హీరో, చెత్త హీరోయిన్ అవార్డులు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.