బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన తో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మహా పోలీసులపై అలానే బాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.దీనితో ఆమె పై శివసేన నేతలు మండిపడుతున్నారు.
శివసేన నేత సంజయ్ రౌత్ ముంబైపై, మహారాష్ట్రపై, మరాఠాలపై మితిమీరి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కంగనాను హెచ్చరించారు.ఈ వ్యాఖ్యలకు కూడా కంగనా కౌంటర్ ఇస్తూ.
తాను సెప్టెంబర్ 9న ముంబైకి వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్ విసరడంతో కంగనాకు, శివసేన ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది.
అయితే ఇలాంటి సమయంలో మహా సర్కార్ కంగనా ను టార్గెట్ చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కారణం క్వీన్ కంగనాకు బృహణ్
ముంబై మున్సిపల్ కార్పొరేషన్
ఆమెకు చెందిన పాళి హిల్ బంగళాకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోకుండా మార్పులు చేర్పులు చేశారని పేర్కొంటూ అధికారులు ఆ బంగళా గేటుకు నోటీసులు అంటించారు.ఈ బంగళాను ‘మణికర్ణిక కార్యాలయం’ పేరుతో కంగనా కట్టించుకుంది.
అయితే దానిని తన సొంత ఆఫీస్‌గా ప్రకటించి అక్కడ నుంచే సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది.అయితే.తన కార్యాలయాన్ని కూల్చబోతున్నట్లు కంగనా ఇప్పటికే ప్రకటించింది.ఆమె ఆఫీస్‌లో బీఎంసీ అధికారులు ఉన్నట్లు ఓ వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ కంగనా వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే ఆమె కార్యాలయంలో బీఎంసీ అధికారులు కనిపించడం గమనార్హం.తన అనుమతి లేకుండా కార్యాలయంలోకి అధికారులు వెళ్లారని, కొలతలు తీసుకున్నారని కంగనా వీడియోలో స్పష్టం చేసింది.

అయితే సుశాంత్ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడం తో ఆమె మరోసారి ప్రముఖుల పై డ్రగ్స్ ఆరోపణలు కూడా చేసింది.ఐతే ఇప్పుడు అదే డ్రగ్స్ కేసు ఆమె మెడకే చుట్టుకొనేట్టు కనిపిస్తుంది.కంగనా రనౌత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయమై విచారణకు ఆదేశించినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు.ఆమె డ్రగ్స్‌కు బానిస అన్న విషయాన్ని అయ్యదన్ సుమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారని ఈ క్రమంలో దీనిపై విచారణ కు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
దీనితో వరుసగా మహా సర్కార్ కంగనాను టార్గెట్ చేస్తున్నట్లు ఆమె మద్దతుదారులు మండిపడుతున్నారు.