కరీంనగర్ జిల్లాలో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర జరగనుంది.ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ప్రారంభంకానుంది.
ఈ హిందూ ఏక్తా యాత్రకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాతో పాటు తరుణ్ చుగ్ కూడా హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో భారీ జనసమీకరణపై తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు.