కాంగ్రెస్‌ అధినాయకత్వానికి ఆ విషయంలో ఇన్నాళ్లకు పని పడింది

ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు నిజం అయ్యాయి.కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఆధిక్యం కనబరిచింది.

 Big Win For Congress Party In Karnataka Details, Congress, Karnataka, Rahul Gand-TeluguStop.com

హంగ్‌ కి ఎలాంటి తావు ఇవ్వకుండా సింగిల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కర్ణాటక ప్రజలు స్పష్టంగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు.రెండు దఫాలుగా అధికారాన్ని దక్కించుకుంటూ వస్తున్న బిజెపికి ( BJP ) ఈసారి మొండి చేయి చూపించి చెయ్యికి ఓటేశారు.

అనూహ్య విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం ఇంకా షాక్ లోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది.ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి విజయాని సొంతం చేసుకోవడం ఒక కలగా మారింది.

విజయాలను మరిచి పోయిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విజయంతో పునరుత్తేజం వచ్చినట్లుగా ఎగసి పడుతోంది.ఒకప్పుడు దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది.

Telugu Congress, Dk Sivakumar, Karnataka, Priyanka Gandhi, Rahul Gandhi, Siddhar

ఆ సమయం లో ఆ పార్టీ అధినాయకత్వం పదే పదే ముఖ్యమంత్రుల మార్పు గురించి మాట్లాడుకోవడం.రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక గురించి మాట్లాడుకోవడం జరిగేది.కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా గెలుపు సాధించక పోవడం తో ఆ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం రాలేదు.ఎట్టకేలకు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి బాధ్యతలను ఎవరికి ఇవ్వాలి అనే విషయమై చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది.

చాలా సంవత్సరాల తర్వాత ఈ పరిణామం ఆ పార్టీ అధినాయకత్వం లో చోటు చేసుకుంది.

Telugu Congress, Dk Sivakumar, Karnataka, Priyanka Gandhi, Rahul Gandhi, Siddhar

దాంతో పార్టీ కి మంచి రోజులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా బిజెపి భారీ విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సమయం లో కర్ణాటక లో మాత్రం కాంగ్రెస్ కి ప్రజలు అధికారాన్ని కట్ట బెట్టడంతో ఆ పార్టీ రాష్ట్ర మరియు జాతీయ నాయకుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ముందు ముందు జరగబోతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా తన బలాన్ని నిలుపుకుంటుందని.

పూర్వపు కాంగ్రెస్ పార్టీ ని గుర్తు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి విజయాలు రాబోయే రోజుల్లో మరిన్ని చూడబోతున్నామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube