ఈ విధంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ ! 

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) సే టార్గెట్ గా బిజెపి పావులు కలుపుతోంది.వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చే విధంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు,  అగ్ర నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

 Bjp Has Targeted Brs In This Way, Telangana Elections, Bjp, Telangana Bjp, Telan-TeluguStop.com

బీఆర్ఎస్ , కాంగ్రెస్ ( BRS, Congress )ల పై పైచేయి సాధించేందుకు అన్ని ఆస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు .ఇప్పటికే బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.మరోవైపు కాంగ్రెస్ కూడా తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తుంది.దీంతో ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య అన్నట్లుగా పరిస్థితి మారడంతో బిజెపి కూడా అలర్ట్ అయింది.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు దగ్గరయ్యే విధంగా వరుసగా కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

Telugu Congress, Kishan Reddy, Telangana Bjp, Telangana-Politics

ఎన్నికలకు ముందు మూడు నెలలు పాటు నిర్విరామంగా వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంది.కేసీఆర్( KCR ) హటావో.తెలంగాణ బచావో బిజెపి జీతావో అనే నినాదంతో తెలంగాణ బీజేపీ నాయకులు ( BJP leaders )ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.

శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి , సెప్టెంబర్ 7న చలో హైదరాబాద్( chalo Hyderabad ) వంటి కార్యక్రమాలకు తెలంగాణ బిజెపి పిలుపునిచ్చింది .అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఉద్యమాన్ని మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టింది.

Telugu Congress, Kishan Reddy, Telangana Bjp, Telangana-Politics

ప్రస్తుతం బీఆర్ఎస్,  కాంగ్రెస్ ల హడావుడి కనిపిస్తున్నా.బిజెపి చాలా సైలెంట్ గానే తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోంది.ముఖ్యంగా రిజర్వుడ్ స్థానాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.ఆయా నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రచిస్తోంది .నెల రోజుల్లో ఎస్సీ , ఎస్టీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube