ఈ విధంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ ! 

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) సే టార్గెట్ గా బిజెపి పావులు కలుపుతోంది.

వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చే విధంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు,  అగ్ర నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

బీఆర్ఎస్ , కాంగ్రెస్ ( BRS, Congress )ల పై పైచేయి సాధించేందుకు అన్ని ఆస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు .

ఇప్పటికే బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

మరోవైపు కాంగ్రెస్ కూడా తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తుంది.

దీంతో ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య అన్నట్లుగా పరిస్థితి మారడంతో బిజెపి కూడా అలర్ట్ అయింది.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు దగ్గరయ్యే విధంగా వరుసగా కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

"""/" / ఎన్నికలకు ముందు మూడు నెలలు పాటు నిర్విరామంగా వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంది.

కేసీఆర్( KCR ) హటావో.తెలంగాణ బచావో బిజెపి జీతావో అనే నినాదంతో తెలంగాణ బీజేపీ నాయకులు ( BJP Leaders )ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.

శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి , సెప్టెంబర్ 7న చలో హైదరాబాద్( Chalo Hyderabad ) వంటి కార్యక్రమాలకు తెలంగాణ బిజెపి పిలుపునిచ్చింది .

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఉద్యమాన్ని మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టింది.

"""/" / ప్రస్తుతం బీఆర్ఎస్,  కాంగ్రెస్ ల హడావుడి కనిపిస్తున్నా.బిజెపి చాలా సైలెంట్ గానే తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ముఖ్యంగా రిజర్వుడ్ స్థానాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.ఆయా నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రచిస్తోంది .

నెల రోజుల్లో ఎస్సీ , ఎస్టీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది.

అదానిపై బాబు చర్యలు తీసుకుంటారా ? ఒత్తిడి పెరుగుతోందా ?