ఏపీలో త్వరలో జరగబోతున్న ఎన్నికలను కేంద్ర అధికార పార్టీ బీజేపీ ( BJP ) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.టిడిపి, జనసేన పార్టీలతో పొత్తు కొనసాగిస్తున్న బిజెపి వీలైనంత ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది.
టిడిపి, జనసేన మద్దతుతో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది .అయితే ఏపీలో ఏ పార్టీ గెలిచినా కేంద్రంలో తమకు తప్పనిసరిగా మద్ద తు ఇస్తారనే నమ్మకం ఉన్నా.సొంతంగా కొన్ని కీలక స్థానాల్లో పాగా వేసేవిధంగా బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.
దీనిలో భాగంగానే ఏపీ లో జరగబోయే ఎన్నికల్లో బిజెపి ప్రభావం పెంచేందుకు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.టిడిపి, జనసేన, బిజెపి కూటమి( TDP BJP Janasena Alliance ) అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ లు వేస్తున్నారు.
ఈరోజు నామినేషన్ లు దాఖలు చేసేందుకు చాలామంది సిద్ధమవుతున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రులు, ఆ పార్టీకి చెందిన చాలామంది ఏపీలో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు.
బిజెపి రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ( Bhupatiraju Srinivas Varma ) నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్చార్జి అరుణ్ సింగ్ ,( Arun Singh ) బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు( Somu Veerraju ) పాల్గొనబోతున్నారు.అలాగే అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వై సత్య కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేనున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రి వికే సింగ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
అలాగే కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయబోతూ ఉండడంతో, ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ఎల్ మురుగన్ హాజరు అవుతున్నారు.అలాగే విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తుండడంతో, ఆ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హాజరుకానున్నారు.