బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వివిధ భాషలలో పలు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం బుల్లితెర పై కాకుండా ఓటీటీలో 24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది.
ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఇప్పటికే ఏడువారాలను పూర్తి చేసుకుంది.ఇక ఏడవ వారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అప్పటివరకు ఎంతో స్నేహితులుగా ఉన్నటువంటి వారు టాస్క్ ల విషయానికి వచ్చేసరికి బద్ధ శత్రువులుగా మారిపోతారు.ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ పెద్ద ఎత్తున గొడవ పడుతూ టాస్క్ లలో పాల్గొనడం జరుగుతుంది.
అలాగే వారం వారం జరిగే నామినేషన్ ప్రక్రియ కూడా ఎంతో రసవత్తరంగా కొనసాగుతూ ఉంటాయి.

ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్ లో వారిని ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే నామినేషన్ ప్రక్రియ లో పెద్ద ఎత్తున కంటెస్టెంట్ ల మధ్య గొడవలు జరుగుతాయి.ఇకపోతే ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా అలాగే వాడివేడిగా జరిగింది.
కంటెస్టెంట్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఈ వారం నామినేషన్ ప్రక్రియ జరిగింది.ఇక ఈ వారం నామినేషన్ లో అఖిల్, అషూ, అజయ్, అనిల్, హమీదా, బిందు నామినేషన్ లలో నిలిచారు.
మరి ఈ ఆరు మందిలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారు, ఎవరు సేఫ్ కానున్నారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.