నేటి రాజకేయాలకు యువత దూరంగా ఉండటానికి కారణం ఇటువంటి ఆత్మహత్యలే అనిపిస్తుంది.అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు వారి స్వార్ధం కోసం ఆడే అటలో ఇంకా ఎంత మంది యువకులు బలి అవ్వాలి.
రాజకీయాలు చేసే నాయకులు సాయి గణేష్ ఆత్మహత్య తో యువతకు ఎం చెప్పదల్చుకున్నారు.
కేసులతో అధికార పార్టీ వేధింపుల వల్లనే సాయి గణేష్ మరణించి ఉంటె కేసుల్ని ఎదుర్కోవటానికి సాయి గణేష్ నమ్ముకున్న పార్టీ నుంచి అండగా ఉన్న నాయకులు ఎవరు.? అతని ఆత్మహత్య తరవాత సాయి గణేష్ పై పెట్టిన కేసులు గుర్తు వచ్చాయా.పోనీ సాయి గణేష్ కుటుంబానికి ఇప్పటికైనా నిస్వార్ధం తో అండగా ఉన్నారా అనేది ఆ నాయకులకే తెలియాలి.
కేసులు పెట్టి వేధించినప్పుడు ఈ నాయకులకు వాళ్ళ పార్టీ కార్యకర్త గుర్తుకు రాలేదా.

ఇక పోతే అధికార పార్టీ వారికి అధికారం లో శాశ్వతం గా ఉంటాం అని కలలు కంటున్నారు ఏమో.మహా మహా పార్టీలు మట్టి లో కలిసిపోయాయి.గొప్ప గొప్ప పదవులు చేసినవారు నేడు ఇంట్లో ఉంటున్న పరిస్థితి చూస్తునాం.
అధికారం శాశ్వతం కాదు అని గుర్తుఎరిగి ప్రజలకు ఎలా ఉపయోగంగా ఉన్నాం అని ఆలోచించాలి.అధికార పార్టీ వాళ్ళు కూడా మనుషులే అని వాళ్ళు మర్చిపోయారు అనుకుంట.
వాళ్ళకి కుటుంబాలు పిల్లలు ఉంటారు.భాధ కి తెలియదు కదా అధికార పార్టీ నా ప్రతిపక్ష పార్టీ నా అని అందరి దగ్గరకు వస్తుంది ఏదో ఒక రోజు.
కేసులు పెట్టి వేదింపులకు గురి చేసి అవతలపార్టీ నాయకులని అక్కున చేర్చుకున్న నాయకులు ఒక్కటి ఆలోచన చెయ్యాలి .అటువంటి నాయకులు మన మంచి కోరుకుంటారా.? చెడు కోరుకుంటారా.?ఏది ఏమైనా ఆస్తులు కాపాడుకోవటానికి లేదా సంపాదించుకోవటానికి మాత్రమే నేటి రాజకీయాలు.అమాయకులు అయిన యువత ని వాడుకొని యువత చావులతో రాజకీయాలు చేస్తున్న మీకు శతకోటి నమస్కారాలు.

యువత గుర్తు యెరిగి మసలుకోండి మీకోసం మీ కుటుంబం మాత్రమే ఎదురు చూస్తుంది.మీరు చనిపోయిన తరవాత మీ యొక్క శవం తోరాజకీయాలు చేస్తారు మన నాయకులు.ఇటువంటి రాజకీయ క్రీడలో బలి పశువులు అవ్వకండి.
ఒక్కసారి మీ కుటుంబం గురుంచి ఆలోచించండి.పార్టీల నాయకులకు ఏమో చీకటి ఒప్పందాలు, స్వార్ధ పూరిత ఆలోచనలు, హోదా, సంపాదన.
కార్యకర్తలకు మాత్రం బలిదానాలు, కేసులు, వేధింపులు, రౌడీ షీట్ లు, పిడీ యాక్ట్ లు.







