ఈ ఏడాది ఆసియా క్రీడలు చైనా వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ సమయంలోనే ఆసియా క్రీడలు జరగడం వల్ల ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో బీసీసీఐ( BCCI ) కొన్ని కీలక మార్పులు చేసింది.
ఆసియా క్రీడలలో పాల్గొనే పురుషుల క్రికెట్ జట్టుకు ఋతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ) కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.మహిళల క్రికెట్ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్( Harmanpreet Kaur ) కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనుంది.
భారత క్రికెట్ సీనియర్ ఆటగాళ్లు వన్డే వరల్డ్ కప్ కోసం రెడీ అవుతుండడంతో కుర్ర జట్టు ఏసియన్ గేమ్స్ లో పాల్గొననుంది.పేసర్ శివం మావి వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
దీంతో రిజర్వ్ ప్లేయర్లుగా సాయి సుదర్శన్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్ ,సాయి కిషోర్, యష్ ఠాకూర్ లను బీసీసీఐ ఎంపిక చేసింది.గతంలో ప్రకటించిన జట్టుని దాదాపుగా కొనసాగిస్తోంది.
కానీ గాయాల కారణంగా కొంతమంది ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం వల్ల సెలెక్టర్లు ఇతర ప్లేయర్లను జట్టులోకి తీసుకోవడం జరిగింది.
మహిళల క్రికెట్ జట్టు విషయానికి వస్తే సీనియర్ మహిళల జట్టు పూర్తి బలంతో ఆసియా క్రీడల్లో పాల్గొననుంది.
మహిళల జట్టులో కూడా కొంతమంది గాయాల కారణంగా దూరమయ్యారు.దీంతో స్నేహ రాణా,( Sneha Rana ) కాశ్వీ గౌతమ్,( Kashvee Gautam ) సైకా ఇషాక్, హర్లీన్ డియోల్ లను బ్యాకప్ ప్లేయర్లుగా ప్రకటించారు.
అంజలీ శార్వాణి గాయం కారణంగా జట్టుకు దూరం అవడంతో.పూజా వస్త్రాకర్ ను ఎంపిక చేశారు.

ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 28 వరకు మహిళల టీం పోటీలు, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు పురుషుల టీం పోటీలు జరగనున్నాయి.ఈ మ్యాచ్లన్ని టీ20 ఫార్మాట్లో జరుగనున్నాయి.
భారత పురుషుల జట్టు:
ఋతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, జితేన్ శర్మ, షాబాజ్ అహ్మద్, రవి బిష్నోయి, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివం దుబే, ఆకాష్ దీప్, ప్రభ్ సిమ్రాన్ సింగ్.

రిజర్వ్ ప్లేయర్లు:
సాయి సుదర్శన్, యష్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా.
భారత మహిళల జట్టు:
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జేమీమా రొడ్రిగెజ్, రిచా గోష్, అమన్ జోత్ కౌర్, దేవికా వైద్య, టిటాస్ సధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కణికా అహూజా, ఉమ చెత్రి, అనూష బా రెడ్డి, పూజా వస్త్రాకర్.
రిజర్వ్ ప్లేయర్లు:
స్నేహ రాణా, కాశ్వీ గౌతమ్, సైకా ఇషాక్, హర్లీన్ డియోల్.