లీకైన బండ్ల గణేష్ కాల్ రికార్డింగ్.. త్రివిక్రమ్ గురించి షాకింగ్ కామెంట్లు చేస్తూ?

వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఈరోజు సాయంత్రం జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడిందనే సంగతి తెలిసిందే.యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగాల్సిన ఈ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

 Bandla Ganesh Leaked Call Record Shocking Comments On Trivikram Viral In Social-TeluguStop.com

ఈవెంట్ వాయిదా పడినా ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఈరోజు రాత్రి 8 గంటల 10 నిమిషాలకు ముందుగా ప్రకటించిన విధంగానే రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.

అయితే భీమ్లా నాయక్ ఈవెంట్ కు సంబంధించి బండ్ల గణేష్ మాట్లాడినట్టు ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ అంటే బండ్ల గణేష్ తప్పనిసరిగా ఆ ఈవెంట్ కు హాజరై తనదైన శైలిలో ప్రసంగిస్తారు.బండ్ల గణేష్ ప్రసంగాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఎంతగానో ఇష్టపడతారు.

అయితే భీమ్లా నాయక్ ఈవెంట్ కు మాత్రం బండ్ల గణేష్ కు ఆహ్వానం అందలేదని త్రివిక్రమ్ శ్రీనివాస్ అందుకు కారణమని సమాచారం.

ఒక అభిమాని బండ్ల గణేష్ కు కాల్ చేసి భీమ్లా నాయక్ ఈవెంట్ గురించి అడగగా భీమ్లా నాయక్ ఫంక్షన్ కోసం స్పీచ్ రెడీ చేశానని అయితే తనను ఇంకా ఈవెంట్ కు పిలవలేదని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.త్రివిక్రమ్ గాడు వాడు డౌన్ అవుతానని ఈవెంట్ కు రావొద్దని అన్నాడని అదే ఆలోచిస్తున్నానని నాకు మాత్రం ఈవెంట్ కు వెళ్లాలని ఉందని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.

స్పీచ్ కోసం మంచి డైలాగ్స్ రాశానని బండ్ల గణేష్ తెలిపారు.పిలవకుండా ఈవెంట్ కు వెళితే బాగోదని త్రివిక్రమ్ వైసీపీ వాళ్లతో ప్లాన్ చేసుకున్నాడని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.లీకైన ఆడియో కొంతమంది ఫేక్ అని కామెంట్లు చేస్తుంటే మరి కొందరు మాత్రం ఈ ఆడియో బండ్ల గణేష్ ఆడియోనే అని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube