ఈ ప్రపంచంలో ఉపయోగపడని వస్తువే లేదు.ప్రతి చిన్న వస్తువు కూడా ఏదో విధంగా మనకు ఉపయోగపడుతుంది.
ఇప్పుడు మనం అరటిపండు తొక్కలు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.తొక్కే కదా! అని తీసేయకండి.
ఈ అరటి తొక్కలో చర్మాన్ని సంరక్షించి, నిగారింపు సంతరించుకునే అద్భుత గుణం ఉంటుందట.ఇందులో ముఖ్యంగా విటమిన్ బీ6, బీ12 ఎక్కువ శాతం ఉంటాయి.
ఇప్పటి వరకు ఈ తొక్క ద్వారా జారిపడిన వారి గురించి విన్నాం కానీ, ఇందులో ఇన్ని పోషకాలున్నాయని కొద్దిమందికే తెలుసు.సాధారణంగా అరటిపండు చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అని మనకు తెలుసు.
దీన్ని స్కిన్ కూడా వాడతాం.కానీ, అరటి పండు తొక్కతోనే పండు కంటే ఎక్కువ పనిచేసే తత్వం ఉంటుందట.
అంతేకాదు, దీనిలో మైక్రోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి.అంటే ప్రోటీన్, ఫైబర్, మెగ్నిషియం, పొటాషియం ఎక్కువ శాతం ఉంటుంది.
ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, మృదువుగా ఉంచుతుంది.దీన్ని వాడే విధానం తెలుసుకుందాం.
బనానా పీల్ మాస్క్‌బనానా పీల్ మాస్క్ తయారీ విధానానికి ఒక అరటి పండు తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా తొక్కతోపాటు కట్ చేయాలి.వీటిని మిక్సర్ జార్‌లో వేసి కేవలం తొక్కలను గ్రైండ్ చేయాలి.
దీనికి ఓ రెండు బనానా ముక్కలను కూడా జత చేయాలి.మిగతా అరటి పండు ముక్కలను బనానా స్మూథీ తయారు చేసుకోవాలి.
లేదా మధ్నాహ్నం స్నాక్‌లా తినేస్తే సరిపోతుంది.అరటి తొక్కతో చేసిన పేస్ట్‌లో రెండు స్పూన్ల పాలు కలపి, మళ్లీ గ్రైండ్ చేయాలి.
ఆ తర్వాత ఈ పేస్ట్‌ను ఓ బౌల్‌లో వేసుకుని 10–15 నిమిషాలపాటు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి.అప్పుడు ఈ పేస్ట్ చల్లగా కాస్త బ్రౌన్ రంగులోకి మారుతుంది.
దీన్ని మీ చర్మంపై అలాగే మెడ భాగంపై మాస్క్ మాదిరిగా వేసుకోవాలి.ఓ 20 నిమిషాల తర్వత చల్లని నీటితో కడిగితే చాలు.
మీ చాలా మృదువుగా మారుతుంది.

స్క్రబ్ చేసుకునే విధానంఅరటి తొక్కలతో మొహంపై నేరుగా రబ్ చేసుకోవాలి.ఈ బనానా పీల్ మీ కొల్లజెన్‌ను బూస్ట్ చేసే విధంగా పని చేస్తుంది.దీంతో చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్ తొలగడంతోపాటు రంధ్రాలు మూసుకుపోయి, స్కిన్ ౖటెట్‌గా మారుతుంది.
దీన్ని 20–30 నిమిషాల తర్వాత గొరువెచ్చటి కాటన్ క్లాత్‌తో తుడిచేస్తే సరిపోతుంది.

పళ్లను తెల్లగా మారుస్తుందిబనానా పీల్‌లో యాంటీ బ్యాక్టిరియల్ గుణం పుష్కలంగా ఉంటంది.ఇది దంత సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది.గింగ్వైటీస్, పిరియడెంటీస్‌కు అద్భుతంగా పనిచేస్తుంది.
దీనికి కొన్ని బనానా తొక్క ముక్కలతో దంతాలతోపాటు చిగుళ్లపై కూడా రాయాలి.వారానికి ఓసారి ఇలా చేస్తే సరిపోతుంది.
మీ దంతాలు తెల్లబడతాయి.