ఇటీవల టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం తెలంగాణా భవన్ లో మంత్రి కే.
టి.ఆర్ సమక్షంలో టీ.ఆర్.ఎస్ ప్రాధమిక సభ్యత్వం తీసుకున్నారు.రమణకు సభ్యత్వం ఇచ్చి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కే.టి.ఆర్ కోరారు.కార్యక్రమంలో ఎల్.రమణ ఫాలోవర్స్ టీ.ఆర్.ఎస్ నేతలు కొందరు పాల్గొన్నారు.ఎల్.రమణతో పాటుగా పలు సంఘాల నేతలు ఆయన మద్ధతుదారులు కూడా టీ.ఆర్.ఎస్ లో చేరారు.

ప్రగతి భవన్ లో ఇటీవల సీఎం కే.సి.ఆర్ తో సుధీర్ఘ మంతనాలు జరిగిన విషయం తెలిసిందే.పార్టీ మారడంపైఏ వారి చర్చ కొనసాగింది.అనంతరం కే.సి.ఆర్ టీ.ఆర్.ఎస్ లోకి తనని ఆహ్వానించారని రమణ చెప్పారు.ఈ నెల 9న టీటీడీఎపీ అధ్యక్ష పదవికి రాజీనామా లేఖని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబుకి పంపించారు.నేడు కే.టి.ఆర్ సమక్షంలో టీ.ఆర్.ఎస్ కండువా కప్పుకున్నారు.ఇక త్వరలోనే హుజురాబాద్ లో జరిగే బహిరంగ సభలో కే.సి.ఆర్ తో పాటు ఎల్.రమణ కూడా మీటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.ఈటల రాజేందర్ టీ.ఆర్.ఎస్ ను వీడగా పార్టీలో మరో బలమైన బీసీ నేత ఉండాలని కే.సి.ఆర్ ఎల్.రమణని టీ.ఆర్.ఎస్ లోకి ఆహ్వానించారు. ఎల్.రమణని టీ.ఆర్.ఎస్ పార్టీ ఏవిధంగా ఉపయోగించుకుంటుందో చూడాలి.