పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్ త్వరలోనే బాలకృష్ణతో కలిసి ఒకే తెరపై సందడి చేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే బాలకృష్ణ ఆహా వేదికగా నిర్వహిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి పలువురు స్టార్స్ హాజరయ్యే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ కార్యక్రమానికి త్వరలోనే ప్రభాస్ రానున్నట్లు తెలుస్తోంది.జనవరి 14వ తేదీ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ ను ఈ కార్యక్రమానికి తీసుకురావడం కోసం అల్లుఅరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ బాలకృష్ణ ఇలా ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.సాధారణంగా ప్రభాస్ ఈ విధమైనటువంటి షోలకు రావడానికి ఆసక్తి చూపరు అనే విషయం మనకు తెలిసిందే.ఇదివరకే ప్రభాస్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి ఆహ్వానించిన అందులో పాల్గొనడానికి ఈ బాహుబలి ఆసక్తి కనబరచలేదు.మరి ఈ కార్యక్రమానికైనా వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.