నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే.కొంతగ్యాప్ తరువాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వచ్చింది.
ఈ సినిమాలో అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.
దీని కోసమే బాలయ్య గుండు కూడా చేయించుకున్నాడంటూ వార్తలు వచ్చాయి.కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందట.
బాలయ్య ఈ సినిమాలో గుండుతో కనిపించేది అఘోరా పాత్రలో కాదట. ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న మరో పాత్రలో పవర్ఫుల్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడట.
ఈ పాత్ర కోసమే బాలయ్య గుండు చేసుకున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి బాలయ్య గుండుతో కూడా అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడని అందరూ నోరెళ్లబెడతున్నారు.
ఇక బోయపాటి శ్రీను ఈ సినిమాతో మరోసారి సింహా, లెజెండ్ తరహా సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.