బాలయ్య గుండు ట్విస్టు.. నోరెళ్లబెట్టడం ఖాయం!

నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కొంతగ్యాప్ తరువాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వచ్చింది.

ఈ సినిమాలో అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.

దీని కోసమే బాలయ్య గుండు కూడా చేయించుకున్నాడంటూ వార్తలు వచ్చాయి.కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందట.

బాలయ్య ఈ సినిమాలో గుండుతో కనిపించేది అఘోరా పాత్రలో కాదట.ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న మరో పాత్రలో పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడట.

ఈ పాత్ర కోసమే బాలయ్య గుండు చేసుకున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి బాలయ్య గుండుతో కూడా అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడని అందరూ నోరెళ్లబెడతున్నారు.

ఇక బోయపాటి శ్రీను ఈ సినిమాతో మరోసారి సింహా, లెజెండ్ తరహా సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఈ స్టార్ హీరోల భార్యల గురించి మీకు తెలుసా.. ఆ వ్యాపారాల్లో అదుర్స్ అనిపించారుగా!