ఫ్యాన్స్‌ ను కంగారు పెడుతున్న బిబి3 టైటిల్‌

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీనుల కాంబినేషన్‌లో ఇప్పటి వరకు వచ్చిన సింహా మరియు లెజెండ్‌ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.వీరి కాంబో హ్యాట్రిక్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Boyapati Confusion In Bb3 Tittle, Balakrishna, Tourch Berrar, Boyapati Srinu, M-TeluguStop.com

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ కాంబో మూడవ సినిమా రూపొందుతుంది.ముఖ్యంగా అభిమానుల ఆనందం కోసం బాలయ్య చాలా విభిన్నమైన గెటప్‌ లో కనిపించేందుకు సిద్దం అవుతున్నాడట.

గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్‌ మరియు హీరోయిన్‌ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.హీరోయిన్‌ ఎవరు అనేది సినిమా షూటింగ్‌ పునః ప్రారంభం అయిన సమయంలో చెబుతాను అంటూ ప్రకటించిన బోయపాటి టైటిల్‌ విషయంలో మాత్రం లీక్స్‌ ఇస్తున్నాడు.

ఇప్పటికే సూపర్‌ హీరో, మోనార్క్‌, డేంజర్‌ అనే టైటిల్స్‌ వినిపించాయి.వీటిలోంచి ఒకటి ఎంపిక చేస్తారనుకుంటున్న సమయంలో ఇండస్ట్రీ వర్గాల నుండి మరో టైటిల్‌ లీక్‌ అయ్యింది.‘టార్చ్‌ బేరర్‌’ అనే టైటిల్‌ ను బాలయ్య మూవీ కోసం బోయపాటి పరిశీలిస్తున్నాడు అనేది టాక్‌.

ఈ టైటిల్‌ ఏంట్రా బాబు ఇలా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

క్లాస్‌ వాళ్లకు కూడా ఈ టైటిల్‌ అర్థం అయ్యే పరిస్థితి లేదు.అలాంటిది ఈ సినిమా టైటిల్‌ మాస్‌ ఆడియన్స్‌కు ఎలా అర్థం అవుతుంది బోయపాటి అంటూ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

టైటిల్‌ విషయంలో పునః సమీక్షించుకోవాలని ఏదైనా సింపుల్‌గా రెండు లేదా మూడు అక్షరాల్లో పెట్టాలని అలా పెట్టడం వల్ల సెంటిమెంట్‌గా కూడా వర్కౌట్‌ అయ్యేను అంటూ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube