బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari) షైన్ స్క్రీన్ పథాకం పై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య ,కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు విడుదల అయ్యింది.మరి నేడు విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా కథ ఏమిటి? అనే విషయానికి వస్తే….
కథ:
నేలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) వరంగల్ జైల్లో ఖైదీ.చావు బతుకుల మధ్య ఉన్న భగవంత్ కేసరి తల్లి చావు బ్రతుకుల మధ్య ఉండి చివరిగా తన కొడుకును చూడాలని కోరుకుంటుంది.
జైలు రూల్స్ బ్రేక్ చేసి భగవంత్ కేసరిని బయటకు తీసుకెళ్తాడు జైలర్ శ్రీకాంత్ (శరత్ కుమార్).( Sarath Kumar ) ఈ కారణం వల్ల శ్రీకాంత్ సస్పెండ్ అవుతారు.
ఈయన సస్పెండ్ అయ్యి వెళ్లే లోపు భగవంత్ కేసరి ప్రవర్తన నచ్చి తనని విడుదల చేస్తారు.అదే రోజు శ్రీకాంత్ కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు.శ్రీకాంత్ కూతురు విజ్జి పాపా (శ్రీలీల)( Sreeleela ) బాధ్యత భగవంత్ కేసరి తీసుకుంటాడు.
తండ్రి కోరిక మేరకు విజ్జీని ఆర్మీలో జాయిన్ చేయాలని భగవంత్ అనుకుంటాడు.
కానీ విజ్జీకి అది ఇష్టం ఉండదు.తాను ప్రేమించిన వాడిని పెళ్ళిచేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని అనుకుంటుంది.
మరోవైపు దేశంలో ఉన్న పోర్టులు అన్నీ కలిపే ప్రాజెక్ట్ వి దక్కించుకోవాలని రాహుల్ సంఘ్వి (అర్జున్ రాంపాల్)( Arjun Rampal ) కల.కొన్ని పరిస్థితుల కారణంగా రాహుల్ సంఘ్వి దారిలోకి విజ్జి వస్తుంది.అప్పుడు భగవంత్ కేసరి ఏం చేశాడు? భగవంత్ కేసరికి, రాహుల్ సంఘ్వికి ఉన్న పాత గొడవలు ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటి నటుల నటన:
బాలయ్య నటన విశ్వ రూపం చూపించారు.ఎప్పటిలా మాస్ డైలాగ్స్ తో తెలంగాణ బాషలో మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో ఒదిగిపోయి నటించారు.కాజల్, ( Kajal Aggarwal ) శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ నటన పరంగా ఎవరి పాత్రలకు వారి న్యాయం చేశారు.
టెక్నికల్:
డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా అంటే దాదాపు సినిమాలో కామెడీ ఉంటుంది.కానీ ఈ సినిమాలో మాత్రం పెద్దగా కామెడీ చూపించలేదని చెప్పాలి.బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, అనిల్ రావిపూడి మార్కు టైమింగ్‌తో ఆ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది.ప్రీక్లైమ్యాక్స్‌కు చేరుకునే సరికి కథ పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకుంటుంది.ఇక క్లైమ్యాక్స్ మళ్లీ హైవోల్టేజ్‌నే.
కానీ ఇక్కడ ఒక సర్‌ప్రైజ్ కూడా ఉంటుంది.ఎస్ఎస్ థమన్( Thaman ) అందించిన పాటలు స్క్రీన్‌పై ఆకట్టుకుంటాయి.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రీసెంట్ టైమ్స్‌లో థమన్ గత చిత్రాల కంటే బెటర్‌గా ఉంది. సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కథ మూడ్‌కు కొనసాగింది.
విశ్లేషణ:
బాలయ్య సినిమా అంటే మనకు కొన్ని అంచనాలు ఉంటాయి.అలాగే అనిల్( Anil Ravipudi ) సినిమా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనే ఐడియా కూడా ఉంటుంది.ఆ ఐడియాని దాటి ఇద్దరూ కలిసి చేసిన ప్రయత్నమే భగవంత్ కేసరి.
బాలకృష్ణ సినిమాల్లో ఓవర్ ది బోర్డ్ యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగులు ఆడియన్స్‌కు అలవాటు అయిపోతాయి.కానీ భగవంత్ కేసరి పంచ్ డైలాగుల కంటే పంచులే ఎక్కువ వాడతాడు.
ఈ సినిమా కథ ఏమీ కొత్తగా లేదు.విలన్ వల్ల హీరో ఊరికి దూరం అవుతారు.
అతని జీవితంలోకి మళ్లీ విలన్ రావడం, హీరో తన ఆట కట్టించడం వంటి పాత కథనే కొత్తగా చూపించారు.
ప్లస్ పాయింట్స్:
బాలయ్య నటన ,సంగీతం, క్లైమాక్స్, బాలయ్య డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ బోరింగ్ అందరిని పరిచయం చేయడానికి అనిల్ కి చాల సమయం తీసుకున్నాడు.అక్కడక్కడా పాత సీన్లను తలపించింది.
బాటమ్ లైన్:
బాలకృష్ణను కొత్తగా చూపిస్తూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసిన అనిల్ రావిపూడి అందులో కొంత మేర సక్సెస్ అయ్యారు.ఫ్యాన్స్‌కు మాత్రం సినిమా బాగా నచ్చుతుంది.సాధారణ ప్రేక్షకులు కూడా ఒకసారి చాలా ఆసక్తిగా ఈ సినిమా చూడవచ్చు.