పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ( Renu Desai ) రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రియంట్రీ ఇస్తోంది.ఇక టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao ) విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సినిమాను ప్రమోట్ చేస్తూ వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.
ఇప్పటికే రెండో పెళ్లి విషయం గురించి అలాగే త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అనే ఆసక్తికరమైన విషయాన్ని కూడా బయటపెట్టింది.అయితే అలాంటి రరేణు దేశాయ్ తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది.
రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన బాలు సినిమా ( Balu movie ) కి కాస్ట్యూమ్ డిజైనర్ గా అలాగే ఒక పాటకి ఎడిటర్ గా కూడా చేసింది.అయితే ఈ మూవీ డైరెక్టర్ కరుణాకరన్ రేణు దేశాయ్ కి చాలా సన్నిహితుడట.ఆయన ప్రతిసారి రేణుని ఎంతో ఆప్యాయంగా అక్క అక్కా అని పిలుస్తూ ఉండేవారట.అయితే ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్స్ చేశారు.ఒకరు శ్రియ శరన్ ( Shriya Saran ) మరొకరు నేహా ఒబెరాయ్.అయితే ఇందులో చేసిన నేహ ఒబేరాయ్ గురించి కరుణాకరన్ రేణు దేశాయ్ దగ్గరికి వచ్చి ఈ సినిమాలో తీసుకోబోయే హీరోయిన్ అచ్చం ఐశ్వర్య రాయ్ ని పోలి ఉంటుంది.
చాలా అందంగా ఉంటుంది అని చెప్పాడట.కానీ ఫోటో చూశాక రేణు దేశాయ్ కి అంతగా నచ్చలేదట.అయితే ఆ అమ్మాయి బాగానే ఉన్నప్పటికీ ఐశ్వరరాయ్ అంత అందంగా మాత్రం లేదని చెప్పిందట.అయితే ఈ విషయాన్ని అప్పట్లో మీడియాలో వైరల్ చేసి నేహాఒబెరాయ్ ( Neha Oberoi ) రెణు దేశాయ్ కి నచ్చలేదని కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు.
కానీ రేణు దేశాయ్ కి హీరోయిన్ అంతగా నచ్చకపోయినప్పటికీ ఆమెను సినిమా నుండి తీసేయమని మాత్రం చెప్పలేదట.
కేవలం హీరోయిన్ విషయంలో తన అభిప్రాయం మాత్రమే వ్యక్తపరిచిందట.కానీ ఈ విషయాన్ని వేరే విధంగా కన్వర్ట్ చేసి రూమర్స్ సృష్టించారట.అయితే ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ.
నేను హీరోయిన్ నచ్చలేదని చెప్పాను.కానీ ఆ సినిమా నుండి తీసేయమని చెప్పలేదు.
అలాగే హీరోయిన్( Heroine ) గురించి బ్యాడ్ గా కూడా మాట్లాడలేదు.అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్ .