ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case )లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో రిమాండ్ లో ఉన్న నిందితులు తమ బెయిల్ పిటిషన్లను విత్ డ్రా( Bail Petition Withdraw ) చేసుకున్నారు.
కేసులో సెక్షన్ 70 ఐటీ యాక్ట్ ను పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.పదేళ్ల కన్నా ఎక్కువ శిక్షపడే సెక్షన్ కావడంతో సెషన్స్ కోర్టుకు వెళ్లాలని నిందితులకు నాంపల్లి కోర్టు( Nampally Court ) సూచించింది.
ఈ క్రమంలో ఏసీఎంఎం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను నిందితులు విత్ డ్రా చేసుకున్నారు.రేపు నాంపల్లి సెషన్స్ కోర్టులో నిందితులు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేయనున్నారు.