వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు( Ex Minister Harish Rao ) పాల్గొన్నారు.ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అమలు చేయడం లేదని తెలిపారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారన్న మాజీ మంత్రి హరీశ్ రావు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైందని ప్రశ్నించారు.గెలిచినా, ఓడినా ప్రజల మధ్యలో ఉండే పార్టీ బీఆర్ఎస్( BRS ) అని స్పష్టం చేశారు.
రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతలను ఆదుకున్నామని చెప్పారు.
పదేళ్లలో బీజేపీ ( BJP ) ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణకు బీజేపీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదన్న హరీశ్ రావు నర్సింగ్ కాలేజీలు అడిగినా కట్టించలేదని విమర్శించారు.నిత్యావసర ధరలను సైతం పెంచి పేదల నడ్డివిరిచారన్నారు.
వంట గ్యాస్ వెయ్యి రూపాయలు చేసి పేదలను దోచుకుంటున్నారని చెప్పారు.ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు.
పదేళ్లలో బీజేపీ చెప్పుకోవడానికి ఏమీలేదని ఎద్దేవా చేశారు.