పాఠశాల అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రభుత్వ పాఠశాల( Government school )లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) వేములవాడ, సిరిసిల్ల పట్టణ పరిధి లోని ప్రభుత్వ పాఠశాలలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలించారు.

 School Development Works Should Start Immediately :: District Collector Anurag J-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మత్తులు, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకురావడం,బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదికి విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతులు అమ్మ పాఠశాల కమిటీల ద్వారా జూన్ 10 వరకు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు.పాఠశాలలకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేయాల్సిన మరమ్మత్తు పనులు అదనపు తరగతుల నిర్మాణం టాయిలెట్స్, మొదలగు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను కలెక్టర్ పరిశీలించి, ప్రాధాన్యత ప్రకారం పనులు వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టే పనులకు నిధులు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతుందని, అభివృద్ధి పనుల ప్రతిపాదనలో 20 శాతం మేర నిధులు పనులు ప్రారంభించిన వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డి.

ఈ .ఓ రమేష్ కుమార్ , వేములవాడ మున్సిపల్ కమిషనర్ అవినాష్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube