జూలై 14న రిలీజైన బేబీ( Baby Movie ) సినిమా రిలీజై నెల కావొస్తున్నా ఇంకా ఎక్కడో ఒక చోట రన్ అవుతుంది.స్టార్ సినిమా కూడా రెండో వారం ఎత్తేస్తున్న ఈ టైం లో నెల రోజుల పాటు బేబీ సినిమా ఆడుతుంది అంటే అది మామూలు విషయం కాదు.
ముఖ్యంగా బేబీ సినిమా యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవడంతో సినిమా సూపర్ హిట్ చేశారు.సాయి రాజేష్( Sai Rajesh ) మొదటి నుంచి ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
నిర్మాత ఎస్.కె.ఎన్ కూడా సినిమాపై నమ్మకంగా ఉన్నాడు.
బేబీ సినిమా నెల రోజుల తర్వాత కూడా ఆడుతూనే ఉంది.
ఈ సినిమా ఇప్పటివరకు 91 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది.అంటే ఇంకో 9 కోట్లు( Baby Movie Collections ) రాబడితే 100 కోట్లు రికార్డ్ సృష్టిస్తుంది.
అయితే అది సాధ్యమయ్యే పనేమి కాదు.ఓ పక్క జైలర్ తో పాటు ఈ వీకెండ్ వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.బేబీ సినిమా ఆ 9 కోట్లు రాబడితే మాత్రం చిన్న సినిమాల్లో బాహుబలి రేంజ్ ఇదని చెప్పొచ్చు.7 కోట్ల బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడమే అదో పెద్ద సెన్సేషన్ అని చెప్పొచ్చు.