మా భూమిని ఆక్రమించుకున్నాడు.. పంజాబీ పోలీస్ అధికారిపై ఎన్ఆర్ఐ జంట ఆరోపణలు

వివిధ దేశాల్లో స్థిరపడిన పంజాబీ ఎన్ఆర్ఐలు రాష్ట్రంలో ఉన్న తమ ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ప్రవాసుల ఆస్తులను కొందరు అక్రమించుకోవడం, నకిలీ పత్రాలను సృష్టించి తమ సొంతం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

 Australia Based Nri Couple Alleges Illegal Possession Of Land By Punjab Police D-TeluguStop.com

న్యాయ వ్యవస్థలోని లోసుగులను అడ్డుపెట్టుకుని వీరు విచారణ ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నారని పలువురు ఎన్ఆర్ఐలు వాపోతున్నారు.తాజాగా రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారిపై ఆస్ట్రేలియాకు చెందిన ఎన్ఆర్ఐ జంట భూకబ్జా ఆరోపణలు చేసింది.

బాధితులను శిల్పా శర్మ, అరుణ్ శర్మలుగా గుర్తించారు.వీరు శుక్రవారం లూధియానా పోలీస్ కమీషనర్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.

దుగ్రిలో వున్న తమ ఫ్లాట్‌లోని కొంత భాగాన్ని రణ్‌ధీర్ సింగ్ అనే డీఎస్పీ ఆక్రమించుకున్నారని , అలాగే ఆ ప్రాంతంలో గదులు నిర్మించి కొందరికి అద్దెకు ఇచ్చినట్లు ఎన్ఆర్ఐ దంపతులు ఆరోపించారు.ఈ విషయమై తాము డీజీపీ, సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశామని చెప్పారు.

దీనిపై పోలీసులు విచారణ జరిపినప్పటికీ.భూమి యాజమాన్యాన్ని ధృవీకరించడానికి పోలీసు అధికారులెవ్వరూ సంఘటనా స్థలాన్ని సందర్శించలేదని దంపతులు తెలిపారు.

ఈ క్రమంలోనే తాము సీపీ కౌస్తుభ్ శర్మను కలిశామని.ఆయన దీనిపై వివరాలు తెలుసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని శిల్పా దంపతులు పేర్కొన్నారు.

Telugu Arun Sharma, Australia, Ludhiana, Nri, Punjab Dsp, Randhir Singh, Shilpa

తమకు చెందిన 1,400 చదరపు గజాల స్థలంలో 90 చదరపు గజాలను పోలీసులు ఆక్రమించుకున్నారని.వారికున్న పలుకుబడి, ఆధికారంతో మిగిలిన భాగాన్ని కూడా ఆక్రమించుకుంటారని బాధితులు భయపడుతున్నారు.అతను మమ్మల్ని ఏదైనా కేసులో ఇరికించే అవకాశం వుందదని వారు వాపోతున్నారు.పోలీసు అధికారులు తమకు న్యాయం చేయని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని ఎన్ఆర్ఐ దంపతులు తేల్చిచెప్పారు.

మరోవైపు ఈ ఆరోపణలపై డీఎస్పీ రణ్‌ధీర్ స్పందించారు.తనపై పలువురు అధికారులు చేసిన విచారణలో ఎలాంటి తప్పును కనుగొనలేదన్నారు.

మంజిత్ సింగ్ అనే ప్రాపర్టీ డీలర్‌తో సదరు ఎన్ఆర్ఐ జంటకు సమస్య వుందని.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి తనను కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube