టీవీ ప్రమోటర్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్...18 వరకు జ్యుడిషియల్ కస్టడీ

రిపబ్లిక్ టీవీ ప్రమోటర్ అర్నాబ్ గోస్వామి ని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఆర్కిటెక్చర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య కేసుకు సంబంధించి అర్నాబ్ పై కేసు నమోదు కావడం తో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Republic Tv Promoter Arnab Goswami Arrest And Send To 14 Days Judicial Custody-TeluguStop.com

ఈ రోజు ముంబై కోర్టులో అర్నాబ్ ను ప్రవేశపెట్టగా ఆయనను 18 వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించనున్నట్లు కోర్టు వెల్లడించింది.ముంబైలో రిపబ్లిక్‌ టీవీ స్టూడియోకు సంబంధించిన ఇంటీరియర్‌ పనులు అలీబాగ్‌కు చెందిన డిజైనర్‌ అన్వయ్‌ నాయిక్‌(53) చేశాడు.

అయితే కొద్దిరోజుల తర్వాత అలీబాగ్‌లోని తన ఇంట్లో 2018 మే 5వ తేదీన అన్వయ్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు.దానితో ఆయన తల్లికూడా ఆత్మహత్యకు పాల్పడడం తో అన్వయ్ చేత ఇంటీరియర్ పనులు చేయించుకున్న అర్నాబ్ డబ్బులు ఇవ్వలేదని అందుకే తన భర్త,అత్త ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు అంటూ అన్వయ్ భార్య, కుమార్తె ఆరోపిస్తున్నారు.రిపబ్లిక్ టీవీ ఇంటీరియర్ పనులు చేయించుకొని సుమారు రూ.83 లక్షల వరకు బకాయిలు ఇవ్వలేదని, దీనితో అప్పుల బాధ తాళలేక తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు అన్వయ్ భార్య అక్షత ఆరోపించారు. అన్వయ్ కుమార్తె ఆద్న్యా నాయిక్‌ సైతం తల్లి అక్షత కలిసి విలేఖరుల సమావేశం లో పాల్గొని ఈ మేరకు ఆరోపణలు చేశారు. టీవీ స్టూడియో పనులు చేయించుకున్న అర్నబ్‌ పూర్తి డబ్బులు చెల్లించలేదని దీంతోనే తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోవడం తో ఆయన కొత్త పనులు ఏమీ చేయలేకపోయారని తెలిపారు.

అందుకే తీవ్ర ఒత్తిడికి గురైన తన భర్త అన్వయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీంతో ఆయన తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని అక్షత విలపించారు.ఈ విషయానికి సంబంధించి అన్వయ్‌ సుసైడ్‌ నోట్‌ కూడా రాశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయలేదన్నారు.దీనికి సంబంధించి చాలాసార్లు ముఖ్యంగా అర్నబ్‌ బెదిరించాడని ఆరోపించారు.అన్వయ్‌ నాయిక్‌ సుసైడ్‌ నోట్‌లో కూడా అర్నబ్‌ గోస్వామి పేరుతోపాటు మరో ఇద్దరి పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.అయితే దీనికి సంబంధించి పోలీసులు అప్పుడే కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీనితో ఈ విషయంపై మళ్లీ అన్వయ్‌ నాయిక్‌ భార్య, కుమార్తెల ఫిర్యాదు చేయడం తో స్పందించిన పోలీసులు వెంటనే అర్నాబ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.అర్నాబ్‌ను అరెస్టు చేసిన అనంతరం ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీబాగ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఆ తర్వాత స్థానిక మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచగా.18వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.దానికి కోర్టు తిరస్కరించినట్లు తెలుస్తుంది.మరోపక్క తన అరెస్టును సవాల్‌ చేస్తూ రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి బాంబే హైకోర్టును ఆశ్రయించారు.పిటిషన్‌లో అర్నాబ్‌ తన అరెస్టు అక్రమమని, వెంటనే విడుదల చేసేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని, అలాగే ఎఫ్‌ఐఆర్‌ను కూడా రద్దు చేయాలని పిటిషన్‌లో కోర్టును కోరారు.

తన అరెస్టు ప్రేరేపితమని, మూసివేసిన కేసులో అక్రమంగా అరెస్టు చేశారని, అలాగే తన టీవీ చానల్‌కు వ్యతిరేకంగా ప్రతీకార రాజకీయాలకు మరో ప్రయత్నమని ఆరోపించారు.అరెస్టు సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని, తనతో పాటు కుమారుడిపై పోలీసులు దాడి చేశారని, వ్యానులోకి ఈడ్చుకు వెళ్లారని పిటిషన్‌లో పేర్కొనగా వాటన్నిటిని కూడా కోర్టు తోసిపుచ్చుతూ ఆయనను జ్యుడీయల్ రిమాండ్ కు తరలించాలి అంటూ ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube