ఈ మద్య వైసీపీ( YCP )లో వర్గ విభేదాల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.నిన్న మొన్నటి వరకు నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు జిల్లా ఇంచార్జ్ రూప్ కుమార్ ల మద్య వర్గ విభేదాలు ఏ స్థాయిలో కొనసాగాయో అందరికి తెలిసిందే.
స్వయంగా వైఎస్ జగన్ కలుగజేసుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేనంతగా విభేదాలు కొనసాగాయి.ఫలితంగా జిల్లాలో పార్టీ క్యాడర్ బలహీన పడుతూ వచ్చింది.
ఇప్పుడు కోనసీమ జిల్లా లో వర్గ పోరు రాజుకుంది.రామచంద్రపురం నియోజిక వర్గంలో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మద్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనెంతలా వివాదం కొనసాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం నియోజిక వర్గ టికెట్ ను తన కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్ కు ఇప్పించే విధంగా పిల్లి సుభాష్ చంద్రబోష్ ప్రయత్నిస్తుంటే.తను మాత్రం టికెట్ వదిలే ప్రసక్తే లేదని వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెల్లుబోయిన వేణు ఖరాకండిగా చెబుతున్నారు.దీంతో వివాదం రాజుకుంది.గత ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్( Pilli Subhash Chandra Bose ) సలహా మేరకే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు సపోర్ట్ చేశామని, ఈసారి ఆయనే టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితిలో మద్దతు ఇవ్వమని పిల్లి సుభాష్ చంద్రబోష్ వర్గీయులు చెబుతున్నారు.

ఒకవేళ టికెట్ మళ్ళీ చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ( Chelluboyina Srinivasa Venugopalakrishna )కే కేటాయిస్తే పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ వీడే అవకాశం కూడా లేకపోలేదు.దీంతో ఈ నియోజిక వర్గ టికెట్ జగన్ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఎన్నికల వేళ మళ్ళీ గెలుపు కోసం జగన్ గట్టిగా ప్రయత్నిస్తుంటే.అక్కడక్కడ చెలరేగుతున్న వర్గ విభేదాలు ఆయనను కొంత కలవరనికి గురి చేస్తున్నాయి.ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ కొద్ది సమయంలో వర్గ విభేదాలను పూర్తి స్థాయిలో రూపుమాపి.అసంతృప్త నేతలను బుజ్జగించాల్సి ఉంటుంది.
ఈ విషయంలో వైఎస్ జగన్ ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన నియోజిక వర్గాల వారీగా వైసీపీకి గట్టిగానే డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది.మరి వర్గ విభేదాలకు వైఎస్ జగన్ ఎలా చెక్ పెడతారో చూడాలి.