Bjp: బీజేపీ వ్యూహం అర్థం కాక ఏపీ పార్టీల గందరగోళం 

ఏపీ విషయంలో బిజెపి ( bjp )వ్యూహం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఏపీలో బీజేపీకి సొంతంగా ఒక్క సీటు గెలుచుకునే అంత బలం లేకపోయినా,  ప్రధాన పార్టీలుగా ఉన్న వైసిపి , టిడిపి ,జనసేన( YCP, TDP, Janasena ) లను తమ గ్రిప్ లో పెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

 Ap Party Confusion Without Understanding Bjps Strategy-TeluguStop.com

ఏపీలో ఏ పార్టీ గెలిచినా,  తప్పకుండా బీజేపీ కి మద్దతు ఇవ్వాల్సిన  పరిస్థితిని సృష్టించింది.ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చినా,  వైసిపి వచ్చినా,  కేంద్రంలో బిజెపికి మద్దతు పలకాల్సిన పరిస్థితి నెలకొంది.

ఏపీలో ఏ పార్టీ బీజేపీ ని వ్యతిరేకించలేని పరిస్థితి.  ప్రస్తుత అధికార పార్టీ వైసిపి పరోక్షంగా బిజెపికి అన్ని విషయాలలోనూ సహకారం అందిస్తుండగా , టిడిపి, జనసేన లు సైతం బిజెపిని వ్యతిరేకించే పరిస్థితి లేదు.

వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చినా,  ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకున్నా , ప్రస్తుతం వైసీపీ మాదిరిగానే బిజెపికి సహకారం అందించాల్సిందే.

Telugu Amith Sha, Ap, Janasena, Janasenani, Jp Nadda, Pavan Kalyan, Tdp Bjp Alia

బిజెపితో కలిసి అధికారిక మిత్రపక్షంగా మారారని టిడిపి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.ఇక వైసిపి కూటమిలో చేరకపోయినా బీజేపీకి మిత్రపక్షంగానే కొనసాగుతామనే సంకేతాలు పంపిస్తోంది .బిజెపితో పొత్తులపై టిడిపి ఇప్పటి వరకు బహిరంగంగా మాట్లాడలేదు.ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు( chandrababu ) ఆసక్తి చూపిస్తున్నారు.కొద్దిరోజుల క్రితమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా , జెపి నడ్డాలతో( Amit Shah, JP Nadda ) చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి భేటీ అయ్యారు.

అయితే ఆ సమావేశాల్లో ఏ ఏ విషయాలపై చర్చించారు అనేది బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

Telugu Amith Sha, Ap, Janasena, Janasenani, Jp Nadda, Pavan Kalyan, Tdp Bjp Alia

ఇక వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) సైతం ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశం అయ్యారు.ఆయన ఏ విషయాలపై చర్చించారు అనేది సరైన క్లారిటీ లేదు.ఏపీలో ఉన్న 25 లోక్ సభ స్థానాల్లో ఎవరు గెలిచినా తమకు ఇబ్బంది లేదని,  అన్ని పార్టీలు తప్పనిసరిగా తమకు మద్దతు ఇచ్చి తీరుతాయనే నమ్మకంతో ఉన్న బిజెపి ఏపీ రాజకీయ పార్టీలను పొత్తుల విషయంలో గందరగోళానికి గురిచేస్తూ పొలిటికల్ గేమ్ ఆడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube