జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వైసీపీ మంత్రులపై సీరియస్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారని వైసీపీ మంత్రుల నోరు అదుపులో పెట్టుకోవాలని మండిపడ్డారు.
అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సీదిరి ( AP Minister Sidiri )సీరియస్ అయ్యారు.తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.
పైగా ఏపీ మంత్రులను విమర్శిస్తున్న తెలంగాణ మంత్రి హరీష్ రావును( Minister Harish Rao ) పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
BRSతో పవన్ కళ్యాణ్ కి ఉన్నా రహస్య ఒప్పందం ఏమిటి.? పవన్ కళ్యాణ్ తో BRS వేలకోట్ల ఒప్పందం జరిగిందని మీడియాలో చూసా.బహుశా అది నిజమేనేమో.
తెలంగాణలో BRSతో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కి ఉన్న లాలూచి ఏమిటి.?.వరంగల్ లో అమ్మాయి ఆత్మహత్య.? తెలంగాణ ఆసుపత్రిలో వీల్ చైర్ లో రోజునే ఈడ్చుకు వెళ్తే మాట్లాడవా.? గోదావరి జలాలపై మాట్లాడవా?.మరి ఇప్పుడు హరీష్ రావు ని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావంటే మేమేం అర్థం చేసుకోవాలి.? సీఎం జగన్ నీ తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ ఏపీ మంత్రి సీదిరి పవన్ కళ్యాణ్ నీ హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.