ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది.మున్సిపల్ కార్మికుల సమ్మెకు సీపీఐఏం( cpm ).
ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు వామపక్షాలు మద్దతు తెలిపాయి.ఈ క్రమంలో సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపటానికి ప్రభుత్వం సిద్ధమైంది.రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్( Buggana Rajendranath, Adimulapu Suresh ) నేతృత్వంలో ఉన్నతాధికారుల కమిటీ కార్మిక సంఘాల నేతలతో చర్చించనుంది.₹26 వేల కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తదితర డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు.
సమ్మె విరమింప జేయడానికి.ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది.ఈ క్రమంలో నేడు ప్రజారోగ్య విభాగంలో కొన్ని కేటగిరీల సిబ్బందికి ₹6వేల చొప్పున హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.దీంతో శానిటేషన్ వాహనాల డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మలేరియా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది.
మరోపక్క అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు.దాదాపు 20 రోజులకు పైగా సమ్మెలు చేస్తూ ఉన్నారు.
కనీస వేతనం పెంచాలని మరికొన్ని డిమాండ్ లతో అంగన్వాడీలు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు.ఇప్పటికే పలుమార్లు అంగన్వాడీ యూనియన్ లతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది.
కానీ ఎక్కడ కూడా ఏకాభిప్రాయం కుదరలేదు.దీంతో రాబోయే రోజుల్లో అంగన్వాడీలు సమ్మె మరింత ఉదృతంగా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.