ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వటంతో గంటల వ్యవధిలో ప్రభుత్వం జీవో జారీ చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.విషయంలోకి వెళితే ఏ రాష్ట్రంలో జైలులో ఉన్న ఖైదీలకు పని ప్రోత్సాహకాలను పెంచాలని న్యాయబద్ధమైన వేతనం చెల్లించాలని హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ 2019 వ సంవత్సరం లో వేసిన పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు వెంటనే ఖైదీలకు న్యాయబద్ధమైన వేతనం చెల్లించేలా జీవో జారీ చేయాలని సాయంత్రం నాలుగు గంటల్లోగా ఆ జీవో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
న్యాయస్థానం దెబ్బకు హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంటల వ్యవధిలో జీవో జారీ చేయడం జరిగింది.దీంతో జైల్లో ఖైదీలకు గతంలో రూ.30 రూ.50 రూ.70 ఇచ్చే వేతనాలను రూ.180 నుంచి 200 వరకు పెంచుతూ జీవో జారీ చేసింది. జైళ్ల శాఖ డిజి సిఫార్సుల మేరకు వేతనాన్ని పెంచుతున్నట్లు జీవో లో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.