ఏపీలో ఎన్నికలు పూర్తి అయ్యి మూడు వారాలు కావస్తుంది.మెల్ల మెల్లగా రాజకీయ వేడి తగ్గుతుంది.
అయితే ఫలితాల సమయంకు పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై ఎవరు ఊహించలేక పోతున్నారు.అయితే ఎవరి నమ్మకం వారిది అన్నట్లుగా అంచనాలు వేసుకుంటున్నారు.
తాజాగా నరసాపురం నుండి వచ్చిన జనసేన పార్టీ నాయకులతో మాట్లాడిన నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడట.పవన్ కళ్యాణ్ వడదెబ్బ కొట్టిన సమయంలో రెండు రోజులు హాస్పిటల్‌కు పరిమితం అయ్యాడు.
ఆ సంఘటనను మనం క్యాష్ చేసుకోలేక పోయాం అంటూ కొందరు నాగబాబు గారితో అన్నారట.
నాగబాబు మాత్రం అలా కొందరు చిల్లర రాజకీయాలు చేస్తారు.
మనకు అలాంటి రాజకీయం వద్దు, కొందరు చిన్న విషయానికి కూడా పెద్దది చేసి సింపతీ కొట్టేందుకు ప్రయత్నిస్తారు.కాని మనం అలా చేయకూడదు అనేది పవన్ అభిప్రాయం.
అందుకే ఎండదెబ్బ కొట్టిన సమయంలో పెద్దగా సీన్ చేసేందుకు పవన్ ఆసక్తి చూపించలేదు.
అందుకే చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా మీడియాలో ఎలాంటి ప్రచారం కాకుండా జాగ్రత్త పడ్డాం అంటూ నాగబాబు అన్నాడు.
జనసేన గౌరవ ప్రథమైన సీట్లను సాధిస్తుందనే నమ్మకంను కార్యకర్తలతో నాగబాబు అన్నట్లుగా తెలుస్తోంది.నాగబాబు తన గెలుపుపై కూడా ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.
