దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగటం తెలిసిందే.తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి.
మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి.మిజోరం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4వ తారీఖు సోమవారం వెలువడనున్నాయి.
ఈ క్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించడం పట్ల సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఇదే సమయంలో పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడానికి కూడా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వంద రోజులలో ఎన్నికలు రాబోతున్నాయి.అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పార్టీ వైసీపీ ఒంటరిగా పోటీ చేయబోతోంది.ఈ క్రమంలో జరగబోయే ఎన్నికలలో 175 కి 175 నియోజకవర్గాలు గెలవాలని జగన్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది.ఇదే సమయంలో.దానికి తగ్గట్టుగానే పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులను నిత్యం ప్రజలలో ఉండే విధంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.విపక్ష పార్టీలు తెలుగుదేశం అదేవిధంగా జనసేన కలసి పోటీకి దిగబోతున్నాయి.
దీంతో ఏపీలో పోటాపోటీ హోరహోరిగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.