రాష్ట్రంలో రథం రాజకీయం ఏమైంది? తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి సంబంధించిన రథాన్ని కొందరు దుండగులు తగుల బెట్టారు.ఇది జరిగి చాన్నాళ్లే అయింది.
ఇక, దీని చుట్టూ అనేక రాజకీయాలు హల్‌చల్ చేశాయి.అయితే.
ఇప్పటి వరకు కూడా ఎవరినీ అరెస్టు చేయకపోవడం.కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే.శుక్రవారం.
రథ సప్తమి పర్వదినం కావడం.ఈ రోజే.
అంతర్వేదిలో స్వామికి ఉత్సవం జరుగుతుండడం గమనార్హం.
ఈ క్రమంలో ఇప్పటికే రూపొందించిన కొత్త రథం సిద్ధమైంది.
దీనిని ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.అయితే.అసలు పాత రథానికి సంబంధించిన వ్యవహారం ఏమైంది? ఆ రథాన్ని దగ్ధం చేసిన వారి ఊసు ఏమైంది? అనేది కీలకంగా మారింది.రథం విషయం చుట్టూ.కొన్నాళ్లు పార్టీలు రాజకీయం చేశాయి.
దీనిని సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు కూడా వచ్చాయి.ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖరాసింది.

అయితే.ఇప్పటి వరకు అంతర్వేది ఘటనపై సీబీఐ దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు.పైగా .ఎలాగూ సీబీఐకి అప్పగించాం కనుక.తాము ఎందుకు దర్యాప్తు చేయాలనే ధోరణిలో రాష్ట్ర అధికారులు ఉన్నారు.వెరసి మొత్తంగా చూస్తే.అంతర్వేది రథం దగ్ధం ఘటన.కొన్నాళ్లు రాజకీయాలు చేసినా.
తర్వాత మా త్రం అది యూటర్న్ తీసుకోవడం.గమనార్హం.
ప్రధానంగా బీజేపీ దీనిని రాజకీయం చేయాలని చూసినా.రథయాత్ర పేరుతో అంతర్వేదిలో హడావుడి చేసేందుకు ప్రయత్నించినా.
ఫలితం లేకపోగా.విమర్శలు వచ్చాయి.
టీడీపీ కూడా ఇదే ఫలితం రావడంతో వెనక్కి తగ్గడం గమనార్హం.