ఒకప్పుడు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సినిమాలకు మాత్రమే పూర్తిగా పరిమితమయ్యేవారు.బుల్లితెర షోలలో కనిపించడానికి, టీవీ షోలను హోస్ట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు.
అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా హీరోహీరోయిన్లు కూడా రియాలిటీ షోలను హోస్ట్ చేస్తూ, వెబ్ సిరీస్ లలో నటిస్తూ అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు.ఎన్టీఆర్, నాగార్జున, నాని లాంటి హీరోలు బిగ్ బాస్ షోకు, సమంత సామ్ జామ్ షోకు హోస్ట్ గా వ్యవహరించారు.
సమంత, కాజల్, తమన్నా లాంటి హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతూ ఉండటంతో పాటు ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.ప్రేక్షకులు ఓటీటీపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో మరో టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే సమంత ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుండగా నాగచైతన్య ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన చైతన్య ఓటీటీల గురించి మాట్లాడుతూ తనకు కొత్తవి ట్రై చేయడం అంటే ఎంతో ఇష్టమని.
డిజిటల్ స్క్రీన్ పై తనకు ఆసక్తి ఉందని మనసులోని మాటలను బయటపెట్టారు.ఓటీటీలో ఎంట్రీ కొరకు ప్లాన్ చేస్తానంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు.
నాగచైతన్య డిజిటల్ స్క్రీన్ పై అడుగు పెడితే ఎవరి డైరెక్షన్ లో నటిస్తారో చూడాల్సి ఉంది.మరోవైపు చైతన్య వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు.
చైతన్య శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఫిదా హీరోయిన్ సాయిపల్లవి నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16వ తేదీన విడుదల కానుండగా అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో చైతన్య థ్యాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు.