అమ్మకానికి మరో 3 ప్రభుత్వ బ్యాంకులు?

కేంద్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్న బ్యాంకింగ్‌ రంగాన్ని ఇతర బ్యాంకుల్లో విలీనం చేసింది.అయితే, కేంద్రం ఇది వరకే ప్రభుత్వం రంగ బ్యాంకులను ప్రైవేటీకరణకు పూనకున్న సంగతి తెలిసిందే.

 Another Three Banks Going To Privatise By Central Government. Bank Of India, Lic-TeluguStop.com

ఆ మధ్య బ్యాంకు ఉద్యోగులు సైతం ధర్నా కూడా చేశారు.ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణను వేగవంతం చేసినట్లు తెలిసింది.

ఆ విధంగానే మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తోందని నివేధికలు తెలిపాయి.అందులో ప్రధానంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ కసరత్తును ఫిబ్రవరీ నుంచే వేగవంతం చేసింది.దాన్ని గత బడ్జెట్‌లో కూడా ప్రస్తావించింది.

ఈ జాబితాలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులు కూడా ఉన్నాయని సమాచారం.ఈ నేపథ్యంలోనే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నట్లు తెలిసింది.

ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ కేంద్రానికి చేసినట్లు తెలుపిందని నివేదికలు చెబుతున్నాయి.

Telugu Bank India, Central, Insurence-Latest News - Telugu

కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులనే కాకుండా ఇతర కంపెనీలను కూడా ఇదే విధంగా ప్రైవేటీకరణ చేయడానికి సన్నద్ధమవుతోంది.ఇందులో భాగంగానే బీపీసీఎల్‌ కంపెనీని ప్రైవేటీకరణకు పూనుకుంది.ఇదే కోవాలో ఎయిర్‌ ఇండియా కూడా ఉంది.

ఈ రెండు కంపెనీలు ప్రైవేటీకరణకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.కరోనా నేపథ్యంలో కూడా కొన్ని పనులు వాయిదా పడుతున్నాయి.

గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన్నట్లుగా లైఫ్‌ ఇన్సూరేన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ చేయడానికి నిర్ణయించింది.ప్రభుత్వ రంగానికి చెందిన ఎల్‌ఐసీని ఐపీఓను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ యోచిస్తోంది.

అతి పెద్ద ఎల్‌ఐసీని స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ చేయాలనే కేంద్రం నిర్ణయం ఈ ఏడాదే ప్రారంభించవచ్చు.దేశవ్యాప్త బ్యాంకింగ్‌ సిబ్బంది మాత్రం దీనికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టారు.

ఈ ప్రైవేటీకరణకు వారు విముఖుత చూపిస్తున్నారు.కానీ, రాబోవు రోజుల్లో జరుగుతున్న మార్పులు ఏ పరిస్థితికి దారి తీస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube