తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అనధికారికంగా బ్యాన్ నడుస్తోంది.ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించకుండానే థియేటర్ల యజమానులు స్వచ్చందంగానే థియేటర్లను మూసి వేయడం జరిగింది.
కొన్ని థియేటర్లు మళ్లీ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.లాక్ డౌన్ ను మెల్ల మెల్లగా సడలిస్తూ వస్తున్నారు.
ఈనెల 9 వ తారీకు నుండి హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరింత గా సడలింపు ఉండబోతుంది.మరో వైపు ఏపీలో కూడా కర్ఫ్యూ విషయంలో సడలింపులు వర్తింపజేస్తున్నారు.
కనుక థియేటర్లను మెల్లగా మళ్లీ ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు.గత ఏడాది చివర్లో మాదిరిగానే ఈసారి కూడా థియేటర్లను మెల్ల గా ప్రారంభించి ఆ తర్వాత షో లను పెంచుకోవాలని భావిస్తున్నారు.
గత ఏడాది థియేటర్లను 50 శాతం వరకు మొదట అనుమతించడం జరిగింది.కాని ఈ సారి మాత్రం నేరుగా నూరు శాతం ఆక్యుపెన్సీతో మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి దాదాపుగా రెండు నెలల తర్వాత ఈ నెల చివర్లో థియేటర్లు పునః ప్రారంభం కాబోతున్నాయి.సినిమాల విడుదల కు ఏర్పాట్లు చేసుకోవాలంటూ చిన్న నిర్మాతల నుండి పెద్ద నిర్మాతల వరకు చాలా మందికి ఇండస్ట్రీ వర్గాల వారు మెసేజ్ లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ లు కూడా జరగడం లేదు.ఈ నెల 9 వ తారీకు నుండి లాక్ డౌన్ ను మరింతగా సడలించే అవకాశం ఉంది.కనుక ఆ సమయంలో షూటింగ్ లను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాల షూటింగ్ లు ఈ నెల లోనే ప్రారంభించడంతో పాటు థియేటర్ల ఓపెన్ కూడ ఆ ఈ నెలలోనే అవ్వబోతున్నాయి.
అయితే వచ్చే నెల నుండి పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.