ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజనింగే.. నిర్లక్ష్యం ఏవరిది.?

తెలంగాణలో కార్పొరేట్ స్కూల్స్‎కి ధీటుగా మారుస్తామని సర్కార్ పదే పదే చెబుతున్నా.ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మాత్రం రోజురోజుకు అధ్వాన్నంగా మారుతుంది.

 Another Food Poisoning Case In Mahabubabad Tribal School Details, Food Poisoning-TeluguStop.com

మౌలిక వసతులు కల్పించలేక పోగా, నాణ్యమైన భోజనాన్ని కూడా అందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దీంతో పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా మారింది పరిస్థితి.

రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో ఇటీవల కాలంలో పుడ్ పాయిజన్ ఘటనలు నమోదు అవుతున్నాయి.ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు.అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా నాసిరకం ఆహరం అందిస్తున్నారని, దీంతో తినే ఆహారంలో వానపాములు, బొద్దింకలు, కప్పలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు.తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూళ్లు అధ్వాన్నంగా త‌యారైయ్యాయనడానికి ఈ ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఈ నెల 16న బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ జరిగి వందల మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు.దీనిపై విచారణ కూడా పూర్తికాకముందే సిద్ధిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.

Telugu Cm Kcr, Schools, Mahabubabad, Revanth Reddy, Sharmila, Telangana, Tribal

ఇటీవల మహబూబాబాద్‎లో గిరిజన బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది.దీంతో నలుగురు విద్యార్ధినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.ఆసుపత్రికి తరలించారు.ఆహారంలో వానపాము కన్పించిందని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.కేసీఆర్‎పై, సర్కార్ తీరుపై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పురుగుల అన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Telugu Cm Kcr, Schools, Mahabubabad, Revanth Reddy, Sharmila, Telangana, Tribal

కాంట్రాక్టర్‎లకు డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు.ఈ విషయంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల స్పందిస్తూ.ఉస్మానియా హాస్టల్ నుంచి గురుకుల హాస్టళ్ల వరకు ఎక్కడ చూసినా పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.అదేవిధంగా గురుకుల పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube