ఐరాస లో కీలక పదవులలో ఎంతో మంది భారతీయులు కొలువు తీరి ఉన్నారు.వారి ప్రతిభని గుర్తించి ఐరాస ఎంతో మందికి కీలక భాద్యతలని అప్పగించింది.
ఈ క్రమంలోనే భారత సంతతి మహిళ అనితా భాటియాకి ఐరాస కీలక పదవిని ఇచ్చింది.ఐరాస డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆమె భాద్యతలు స్వీకరించారు.
అయితే ఐరాస భాటియా కి ఈ పదవిని ఎందుకు అప్పగించింది.ఆమె అర్హతలు ఏమిటి అనే వివరాలలోకి వెళ్తే.
మహిళా సాధికారతే లక్ష్యంగా అనితా భాటియాకి ఈ కీలక పదవి ఇచ్చినట్లుగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా అన్నారు.ఆమె ఈ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారనే నమ్మకం తనకి ఉందని అన్నారు.
ప్రపంచ బ్యాంక్ గ్రూపులో భాటియా ఎప్పటినుంచో పలు కీలక భాద్యతలు చేపడుతూ వచ్చారు మహిళా సాధికారతకై ఎంతగానో కృషి చేశారు కూడా.ఆంటోనియా స్ట్రాటిజిక్ మేనేజ్‌మెంట్, రిసోర్స్ మొబిలైజేషన్, మేనేజ్మెంట్ వంటి పలు అంశాలపై విషయ పరిజ్ఞానం ఉంది.